ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసెంబ్లీకి వెళ్లాలని కోరడంలో తప్పేంటి?

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:22 AM

ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకు వెళ్లి సమస్యలపై వాణి వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరదభ్ర గౌడ్‌ ప్రశించారు.

మాట్లాడుతున్న వీరభద్ర గౌడ్‌

డబ్బు వసూలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా

టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్‌

ఆలూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకు వెళ్లి సమస్యలపై వాణి వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరదభ్ర గౌడ్‌ ప్రశించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని ఎమ్మెల్యే విరూపాక్షి చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. తాను ఉద్యోగాలకు, రేషన్‌ డీలర్ల నియామకం, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరోపణలు నిజమైతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, అలాగే రుజువు చేయకపోతే మీరు పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. మీ పార్టీకి చెందిన కార్యకర్త భార్యకు మోడల్‌ హాస్టల్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం వచ్చిందని నాకు ఎంత డబ్బులు ఇచ్చాడో చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్యంలో కర్ణాటక మద్యం ఏరులై పారినా మీరు ఎందుకు నోరు మెదపలేదన్నారు. పేకాట ఆడిస్తున్నట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో స్వంత మండలంలో పేకాట శిబిరాలు జరుగుతుంటే ఎం చేశావని ప్రశ్నించారు. రోడ్లకు గుంతలు పూడ్చేందుకు రూ.2.30 కోట్లు మంజూరయ్యాయని, మీ స్వంత గ్రామంలో రోడ్లు వేస్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆలూరు సర్పంచ్‌ అరుణదేవి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తిమ్మయ్య, కిష్టప్ప, రవి, అశోక్‌, నరసప్ప, కొమ్ము రాజు, నారాయణ, కురువ హనుమప్ప, రాము, కిట్టు, గోపి పాల్గొన్నారు .

Updated Date - Nov 16 , 2024 | 01:22 AM