ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికి కృషి

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:46 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా తెలిపారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరిం చారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారాలపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి అర్జీలను ఇంకా మెరుగ్గా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు ఎట్‌ టూ వ్యూ కేసులు సర్వే, రెవెన్యూ శాఖలో ఎక్కువ శాతం ఉన్నాయని, వాటిని ముందు ఓపెన్‌ చేసి చూసి పరిష్కారం చేయాలని అన్నారు. రీఓపెన్‌ కేసులకు సంబంధించి మొత్తం 33 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెరిఫై చేసి నాణ్యతతో పరిష్కరించా లని, జాగ్రత్తగా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని అన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌ లకు సంబంధించి ఇంకా 18 పెండింగ్‌లో ఉన్నాయని, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావే శంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, డీఆర్వో సి. వెంకట నారాయ ణమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:46 PM