ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: గన్‌పౌడర్ పేలి కూలీ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ABN, Publish Date - Jan 24 , 2024 | 10:56 AM

Andhrapradesh: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినకామనపూడిలో విషాదం చోటు చేసుకుంది. గన్‌ పౌడర్ పేలిన ఘటనలో ఓ కూలీ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

విజయవాడ, జనవరి 24: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినకామనపూడిలో విషాదం చోటు చేసుకుంది. గన్‌ పౌడర్ పేలిన ఘటనలో ఓ కూలీ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చినకామనపూడి గ్రామంలో ఓ రైతుకు చెందిన చేపల చెరువు వద్ద అస్సాంకు చెందిన బికాస్ బరో, రిటూ బరో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. చెరువులపై చేపలు తినేందుకు వచ్చే పిట్టలను తుపాకీతో కాల్చి చంపడం వీరి డ్యూటీ. ఈ క్రమంలో తుపాకీలో వాడేందుకు గన్ పౌడర్ తయారుచేస్తుండగా హఠాత్తుగా పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎడమ చేయి పూర్తిగా తునాతునకలు అవడంతో పాటు, తలకు బలమైన గాయాలు అవడంతో రిటూ బరో(25) అక్కడికక్కడే మృతి చెందాడు. బికాస్ బరోకు కూడా తీవ్ర గాయాలు అవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం బికాస్‌ను విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 10:56 AM

Advertising
Advertising