ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీగిరిలో వైభవంగా లక్ష దీపోత్సవం

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:14 AM

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

లక్షదీపోత్సవం

పుష్కరణికి దశవిధ హారతులు ఇచ్చిన అర్చకులు

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల క్షేత్రం

శ్రీశైలం, నవంబరు 18(ఆంధ్రజోతి): ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరణికి దశవిధ హారతులు కార్యక్రమాలను దేవస్థానం వైభవంగా నిర్వహించింది. కార్తీకమాసంలో సోమవారం రోజులలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను పురస్కరించుకుని క్షేత్రానికి అశేష భక్తజనం తరలివచ్చారు. క్షేత్ర వీధులు భక్తుల రద్ధీతో దర్శనమిచ్చాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలిరావడంతో క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వేకుజామునుంచే పాతాళగంగలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. స్వామి,అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. కాగా ప్రధాన ఆలయం ఎదుట గల గంగాధర మంటపం వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ధ్వజస్తంభానికి ఆకాశ దీపం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజను నిర్వహించి, దీపప్రజ్వలన, దీపారాధనలు చేశారు. అలాగే కార్తీకమాసోత్సవాల సందర్బంగా దేవస్థానంలో అఖండ శివ భజనలు కార్యక్రమం కొనసాగించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు అన్నదాన భవనంలో ఉదయం 10.30గంటల నుంచి 3.30గంటల వరకు భోజనం, సాయంత్రం 6.30 నుంచి అల్పహారం అందజేశారు.

శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసం మూడో సోమవారం పురస్కరించుకొని లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం క్రతువును శాస్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణ గావించి పుష్కరణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పుష్కరణి వద్ద లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వివిధ ఆకృతుల్లో రూపొందించిన దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ లక్షదీపోత్సవంలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు దీపోత్సవం ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.

శ్రీశైల క్షేత్రంలో మూడో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని శాస్రోక్తంగా చేపట్టారు. ప్రతిఏటా కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున పుష్కరిణికి దశవిధ హారతులను నివేదించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా కార్తీక మాసంలో సోమవారాన్ని పురస్కరించుకుని పుష్కరిణికి వేదమంత్రోచ్ఛరణ నడుమ దశవిధ హారతులను నివేదించారు. ఇందులో భాగంగా ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతులను పుష్కరిణికి వరుసగా సమర్పించారు. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పుష్కరిణికి విద్యుత, పుష్పాలతో అలంకరించారు. దశవిధ హారతుల సమయంలో విద్యుద్దీపాలను నిలిపివేసి కేవలం లేజర్‌షోలతో, ఆధ్యాత్మికమైన శబ్దాల నడుమ దశవిధ హారతుల సమర్పించారు.

Updated Date - Nov 19 , 2024 | 12:14 AM