ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నాయకుల భూకబ్జా

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:27 PM

తమ తాత మూత్తాతల వారసత్వంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించేశారని చంద్రయ్య, వీరాంజనేయులు అనే వ్యక్తులు వాపోయారు.

మండగిరిలోని సర్వే నెంబర్‌ 352లోని పత్రాలను చేపెడుతున్న భూ బాదితులు

ఫ న్యాయం చేయాలని బాధితుల బైఠాయింపు

ఆదోని, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తమ తాత మూత్తాతల వారసత్వంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించేశారని చంద్రయ్య, వీరాంజనేయులు అనే వ్యక్తులు వాపోయారు. ఆదోని పట్టణంలోని మండగిరిలోని సర్వే నెంబర్‌ 352లోని భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని చంద్రయ్య, వీరాంజనేయులు బుధవారం ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్‌ 352లో నిర్మాణ పనులు చేపట్టేందుకు వైసీపీకి చెందిన రామకృష్ణారెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి, వెంకటేశ్వ రెడ్డి వెళ్లారు. తమ తాత మూలింటి హుస్సేనప్ప నుంచి రెండెకరాల పొలం, కొత్తింటి నరసమ్మ నుంచి మరో ఎకరా పొలం తమకు వచ్చినందని చంద్రయ్య, వీరాంజనేయులు ఆందోళనకు దిగారు. 1962లో ఈ భూమి కొన్నట్లు తమ దగ్గర రిజిస్ట్రేషన పత్రాలు ఉన్నాయని బాధితులు వారికి చూపించారు. అయితే ఈ పొలాన్ని కర్రి బసమ్మ నుంచి చంద్రకాంతమ్మ అనే మహిళ కొనుగోలు చేసిందని, ఆమె అమిద్‌, అబీద్‌ అనే వారికి విక్రయిస్తే.. వారి నుంచి తాము కొన్నామని వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ భూమిని రామకృష్ణారెడ్డి కాజేశారని, ఎమ్మెల్యే పార్థసారథి న్యాయం చేయాలని బాధితులు అక్కడే బెఠాయించారు.

Updated Date - Nov 06 , 2024 | 11:27 PM