అదుగో చిరుత!
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:43 AM
ఎం.నాగులపల్లి శివారులో రెండురోజుల క్రితం కన్పించి ప్రజలను బెంబేలెత్తించిన చిరుత.. ఫారెస్ట్ అధికారు లు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది.
ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత
బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
ద్వారకా తిరుమల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎం.నాగులపల్లి శివారులో రెండురోజుల క్రితం కన్పించి ప్రజలను బెంబేలెత్తించిన చిరుత.. ఫారెస్ట్ అధికారు లు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. అది ఆ పరిసర ప్రాంతాల్లోనే మకాం వేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం ట్రాప్ కెమెరాలో చిరుత సంచారం నమోదు కావడంతో దానిని పట్టుకునేందుకు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చిరుత సంచా రాన్ని ఖరారు చేసేందుకు ఆ ప్రాంతంలో దొరికిన దాని పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగించి నమూనాలను త యారు చేశారు. వీటిని ల్యాబ్‌లో పరిశీలిం చేందుకు అటవీ శాఖ రేంజర్ రాజమండ్రి కి పంపారు. ఈ క్రమంలోనే ట్రాప్ కెమెరాకు చిరుత సంచారం జాడ కన్పిం చడంతో అప్రమత్తమైన జిల్లా అటవీ శాఖ అధికారి ఆశాకిరణ్ సోమవారం ఆ ప్రాం తాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న ట్రాప్ కెమెరాలను అదనంగా మరో రెండు కెమేరాలను చిరుత జాడ కన్పించిన అందాలమ్మ చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
Updated Date - Oct 22 , 2024 | 12:43 AM