ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:39 AM
బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ఇందుకు ప్రతి విద్యార్థి సహకరించాలని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ పిలుపునిచ్చారు.
బనగానపల్లె, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ఇందుకు ప్రతి విద్యార్థి సహకరించాలని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం బీసీ ఇందిరమ్మకు ఎస్వీ జూనియర్, డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్ మునిస్వామిరెడ్డి, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా బీసీ ఇందిరమ్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల వాడకం ఆపేద్దామన్నారు. మానవ మనుగడకు ప్లాస్టిక్ చాలా ప్రమాదక రమన్నారు. భవిష్యత తరాలకు ప్లాస్టిక్ వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంద న్నారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులు పేపర్‌బ్యాగులు, జూట్‌బ్యాగులను వినియో గించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టంగుటూరు శ్రీనయ్య, టీచ ర్ నాగరాజు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:39 AM