ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీవనోపాధికి రక్షణ కల్పించాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:46 PM

జిల్లాలోని చిన్న, వీధి వ్యాపారస్తుల జీవనోపాధికి రక్షణ కల్పించాలని జిల్లా చిన్న, వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డా.రవికృష్ణ అన్నారు.

నూతన కార్యవర్గంతో గౌరవాధ్యక్షుడు డా. రవికృష్ణ

నంద్యాల, నవంబరు 20 : (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చిన్న, వీధి వ్యాపారస్తుల జీవనోపాధికి రక్షణ కల్పించాలని జిల్లా చిన్న, వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డా.రవికృష్ణ అన్నారు. బుధవారం నంద్యాలలోని మధుమణి సమావేశ భవనంలో కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడుగా డా.రవికృష్ణ, గౌరవ సలహాదారుడిగా ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు, అధ్యక్షుడిగా మహబూబ్‌బాషా, ప్రధాన కార్యదర్శిగా ఉమామహేష్‌, కో ఆర్డినేటర్లుగా రమేష్‌, శివరామిరెడ్డి, ఉపాధ్యక్షులుగా అజీజ్‌ఖాన, వెంకటరమణతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డా.రవికృష్ణ మాట్లాడుతూ చిన్న, వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి ప్రభుత్వం సహకరించాలని, 2014 కేంద్ర వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో మున్సిపాల్టీ, ట్రాఫిక్‌ పోలీసులు, ప్రజాప్రతినిధులతో టౌన వెండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ ద్వారా మెప్మా ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, పట్టణ కూడళ్లలో వెండింగ్‌ జోన్స ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 11:46 PM