ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్చకుల మధ్య ఆధిపత్య పోరుతో ఆలయానికి తాళాలు

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:09 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీచౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో స్వామికి సేవచేసే విషయంలో ఇద్దరు అర్చకుల మధ్య వివాదం తలెత్తింది.

కొత్తపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీచౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో స్వామికి సేవచేసే విషయంలో ఇద్దరు అర్చకుల మధ్య వివాదం తలెత్తింది. వీరి వైఖరితో ఆలయంలో కైంకర్యాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ దేవాలయంలో గతంలో పనిచేసిన రమేష్‌ అనే అర్చకుడికి, ప్రస్తుతం పనిచేస్తున్న రవితేజ అనే అర్చకుడికి మఽఽధ్య సేవల విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో రమేష్‌ గుడికి తాళాలు వేసి వెంట తీసుకెళ్లారని భక్తులు కొత్తపల్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కారం నిమిత్తం దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 03:09 AM