ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బుడమేరు గండ్ల వద్దకు లోకేశ్‌..

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:30 AM

ఎన్టీఆర్‌ జిల్లా, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగించింది. బుడమేరుకు మళ్లీ వరద వచ్చి విజయవాడ మరోసారి ముంపునకు గురవుతుందేమోనని కలవరం చెందాయి.

తిరిగి వర్షాలతో అధికారుల్లో టెన్షన్‌

ఎన్టీఆర్‌ జిల్లా, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగించింది. బుడమేరుకు మళ్లీ వరద వచ్చి విజయవాడ మరోసారి ముంపునకు గురవుతుందేమోనని కలవరం చెందాయి. దీనిపై వివిధ ప్రభుత్వ శాఖలను సీఎంవో సంప్రదించింది. స్ధానికంగా ఉన్న వాగుల్లో ఎంత ప్రవాహం వస్తుందో ముందుగా అంచనావేసే వ్యవస్థ లేదు. దీంతో పడిన వర్షాన్ని బట్టి లెక్కలు వేసే ప్రయత్నం చేశారు. అలా బుడమేరు వాగుకు 5వేల క్యూసెక్కుల వరద రావచ్చునని అధికార వర్గాలు లెక్కగట్టాయి. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పని ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్తగా వస్తున్న వరద మరోసారి విజయవాడ నగరంలోకి వస్తుందేమోనని ఆందోళన చెందిన ముఖ్యమంత్రి.... వాటిని పూడ్చడంపై తక్షణం దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఈ పనిని రెండు రోజుల క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. తన కుమారుడు లోకేశ్‌ను బుధవారం పూర్తిగా ఇదే పనిపై ఉండాలని చంద్రబాబు చెప్పారు. దీనితో నిమ్మలను తీసుకొని లోకేశ్‌ బుధవారం ఉదయం బుడమేరు గండ్ల వద్దకు వెళ్లారు. అప్పటికి ఒక గండి పూడ్చడం పూర్తయింది. మరో రెండు పూడ్చాల్సి ఉంది. అవి త్వరగా పూర్తి కావడానికి ఏం చేయాలో అక్కడే అధికారులతో లోకేశ్‌ మాట్లాడారు. తర్వాత ఒక డ్రోన్‌ కెమెరాను అక్కడ పెట్టి తిరిగి వచ్చారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి గంటకు ఒకసారి డ్రోన్‌ కెమెరాతో పని ప్రగతిని ఆయన పరిశీలిస్తూ వచ్చారు.

Updated Date - Sep 05 , 2024 | 03:33 AM

Advertising
Advertising