23న బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:02 AM
అండమాన్ సముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన
విశాఖపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అండమాన్ సముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో 24 నుంచి తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, కోస్తాలో బుధవారం చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
Updated Date - Nov 21 , 2024 | 04:02 AM