ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: బందరు ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరు ప్రకటించిన పవన్

ABN, Publish Date - Mar 30 , 2024 | 12:50 PM

మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లు అయింది.

అమరావతి, మార్చి30: మచిలీపట్నం లోక్‌సభ (Machilipatnam Lok sabha) అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (balashowry vallabhaneni) పేరును శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (pawan Kalyan) ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లు అయింది. 2019 ఎన్నికల్లో బందరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో దిగి విజయం సాధించారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ క్రమంలో ఆ పార్టీకి బాలశౌరి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేన పార్టీ నుంచి బందరు ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తారనే ఓ ప్రచారం అయితే హల్‌చల్ చేసింది. మరోవైపు అదే సమయంలో బందరు ఎంపీగా జనసేన పార్టీ నుంచి బండారు నరసింహరావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలను బండారు నరసింహరావు (Bandaru narsimharao) కలిగి ఉన్నారు. దీంతో బండారు పేరు దాదాపుగా ఖరారు అయిందనే ఒక దశలో ప్రచారం సైతం సాగింది.

దాంతో బందరు జనసేన పార్టీ అభ్యర్థిపై ఓ డైలమా అయితే నెలకొంది. ఇంకోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో శుక్రవారం వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. ఆ క్రమంలో బాలశౌరి పేరును పవన ఖరారు చేసినట్లు సమాచారం. అదీకాక బందరు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి, ఎంపీ వల్లభనేని బాలశౌరి మధ్య చాలా కాలంగా వైరం ఉంది. అలాంటి వేళ ఎంపీ అభ్యర్థిగా బండారు నరసింహరావును నిలిపే కంటే వల్లభనేని బాలశౌరి అయితేనే కరెక్ట్ అని ఓ అభిప్రాయానికి పవన్ కల్యాణ్ వచ్చారనే ప్రచారం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..

Updated Date - Mar 30 , 2024 | 01:20 PM

Advertising
Advertising