ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న మదనపల్లె టౌనబ్యాంక్‌

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:58 PM

ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్‌ తెలిపారు.

మాట్లాడుతున్న టౌనబ్యాంకు ముఖ్య కార్యనిర్వహకాధికారి పీవీప్రసాద్‌

మదనపల్లె అర్బన, సెప్టెంబరు29: ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం స్థానిక సీటీఎం రోడ్డులోని టౌన బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మదన పల్లె -కో ఆపరేటివ్‌ టౌనబ్యాంకు శత వార్షి కోత్సవ మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్‌ రూ.111కోట్ల31 లక్షల మూలధనం కలిగి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 90కోట్ల 84 లక్షలు డిపాజిట్లు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ రుణాల కింద రూ. 58కోట్ల 86 లక్షలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో బ్యాంకు పాలకవర్గం ఏర్పడి న తరువాత బ్యాంకు శత వార్షికోత్సవాలను ఒక ఏడాదిపాటు ఘనంగా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఆడిటర్లు కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, పీఎస్‌ చైతన్య, బ్యాంకు మేనేజర్లు సుధారాణి, జయచంద్రనాయుడు, రవిచంద్రారెడ్డి, రాధిక, రాజశేఖర్‌, బ్యాంకు సిబ్బంది మాజీ డైరెక్టర్లు పసుపు పొడి రవి, ఎస్‌ఎ రియాజ్‌, మధు కర్‌, సయ్యద్‌ఖాన, సోమశేఖర్‌, భాస్కరకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:58 PM