ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:50 PM

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భారతదేశపు తొలి విద్యా శాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

మౌలానా అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భారతదేశపు తొలి విద్యా శాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. సోమవా రం నంద్యాలలోని మున్సిపల్‌ టౌనహాలులో అబ్దుల్‌ కలాం ఆజాద్‌ 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మౌలానా అబ్దుల్‌కలాంఆజాద్‌ చిత్రపటానికి కలెక్టర్‌, ఇతర ప్రజాప్రతినిఽధులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌కలాంఆజాద్‌ దేశప్రగతికి, దేశఅభివృద్దికి ఎనలేని కృషి చేశారన్నారు. విద్యార్ధులు ప్రదర్శించిన కళానృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం మౌలానా అబ్దుల్‌కలామ్‌ ఆజాద్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించి, గెలుపొందిన విద్యార్ధులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అంద జేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌ పాల్గొన్నారు.

నందికొట్కూరు: మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జయంతి వేడుకలను నందికొట్కూరులో టీడీపీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి డా.కాకరవాడ చిన్న వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉర్దూ అకాడమి మాజీ డైరెక్టర్‌ అబ్దుల్‌ సుకూర్‌, తదితర నాయకులు కలిసి పట్టణంలోని అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్‌ సుకూర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:50 PM