AP Politics: పవన్‌కు వదినమ్మ అదిరిపోయే గిఫ్ట్.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే..
ABN, Publish Date - Jun 15 , 2024 | 06:28 PM
అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలపై పవన్ కళ్యాణ్ ప్రేమాభిమానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు దంపుతులు సైతం పవన్‌ను తమ సొంత కొడుకులా చూసుకుంటారు. ఎన్నికల సమయంలోనూ పవన్ గెలుపును కాంక్షిస్తూ చిరంజీవి తన వంతు ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆర్థికంగానూ తమ్ముడికి అండగా నిలిచారు.
అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలపై పవన్ కళ్యాణ్ ప్రేమాభిమానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు దంపుతులు సైతం పవన్‌ను తమ సొంత కొడుకులా చూసుకుంటారు. ఎన్నికల సమయంలోనూ పవన్ గెలుపును కాంక్షిస్తూ చిరంజీవి తన వంతు ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆర్థికంగానూ తమ్ముడికి అండగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్నయ్య, వదినల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఢిల్లీలో ఎన్డీయే పక్షాల భేటీ తర్వాత చిరంజీవి దంపతులను కలిసిన పవన్ కళ్యాణ్ వారితో గడిపిన ఆనంద క్షణాలు మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మె్ల్యేగా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా పవన్ కళ్యాణ్‌ను నియమించిన తర్వాత.. వదినమ్మ సురేఖ ఓ బహుమతి అందించారట. ఈ విషయాన్ని ఇవాళ చిరంజీవి స్వయంగా ఎక్స్‌లో తెలిపారు.
TG Bharath: సమస్యలు తీరిస్తే భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది: మంత్రి టీజీ భరత్
పవన్‌కు బహుమతి..
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు తర్వాత పవన్ కళ్యాణ్ అన్న, వదినలను కలిశారు. ఈ సందర్భంగా వదిన సురేఖ పవన్‌కు ఓ బహుమతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి పేరుతో చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్‌కు సురేఖ ఏమిచ్చారనుకుంటున్నారా.. ఓ ఖరీదైన పెన్నును పవన్‌కు బహుమతిగా అందించారు.
Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్నును సురేఖ బహుమతిగా అందించారు. ఈ పెన్నును స్వయంగా సురేఖ పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా.. పవర్‌స్టార్ ఆనందంతో వదినమ్మను కౌగిలించుకుని తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే అద్బుతమైన బహుమతి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ చిరు దంపతులకు ధ్యాంక్స్ తెలిపారు. అలాగే తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తూ అంటూ చిరు తన వీడియో చివరిలో రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వొద్దంటూ అధికారులకు ఆదేశాలు
Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 15 , 2024 | 06:31 PM