ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ ఉక్కు సెయిల్‌లో విలీనం!

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:16 AM

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో (సెయిల్‌) విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం.. విలీనంతో రెంటికీ లాభమే

ప్లాంట్‌కు తొలగనున్న ముడిసరుకు,

ఆర్థిక సంబంధ ఇబ్బందులు

పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి చాన్స్‌

ప్రైవేటీకరణ ముప్పూ తప్పినట్టే!

మరోవైపు మరింత విస్తరణకు సెయిల్‌కూ అవకాశం

దక్షిణాది మార్కెట్‌పై గట్టి పట్టు కార్మిక సంఘాలదీ విలీనం మాటే

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో (సెయిల్‌) విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి ఇదే డిమాండ్‌తో ఉద్యోగ, కార్మిక సంఘాలు చాలాకాలంగా ఉద్యమిస్తున్నాయి. అలా చేస్తే రెండు

వర్గాలకూ లాభమేనని సూచిస్తున్నాయి. అయితే, ప్రైవేటీకరణ అంటూ మూడేళ్లుగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రకరకాల ప్రయోగాలు చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడిరోడ్డున నిలబెట్టింది. అప్పటినుంచీ కార్మిక సంఘాలు పట్టువదలకుండా పోరాడుతున్నాయి. నిరవధిక నిరాహార దీక్షలతో స్టీల్‌ ప్లాంటును నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా విశాఖ ఉక్కు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చింది.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అటు ముడిసరుకు కొరత.. ఇటు ఆర్థిక ఇబ్బందులతో విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) తీవ్ర సంక్షోభంలో ఉంది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, ముడి పదార్థాల కొరత కారణంగా ఒక బ్లాస్ట్‌ ఫర్నేసునే నడుపుతూ రోజుకు 4 వేల టన్నులకు మించి ఉత్పత్తి చేయడం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా యాజమాన్యం ముడి పదార్థ్థాలను సమీకరించుకోలేకపోతోంది. విదేశాల నుంచి బొగ్గును నౌకల ద్వారా తెప్పించుకుంటూ వాటికి రవాణా చార్జీలు చెల్లించలేక ఆపసోపాలు పడుతోంది. ఉక్కు తయారీకి ప్రధానమైన ముడి ఇనుము కోసం నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)పై ఆధార పడుతోంది. రెండు సంస్థల మధ్య ఒప్పందం ఉన్నా ఆ మేరకు ముడి ఇనుము ఇవ్వకపోవడం వల్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఏడాదికి 32లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 73 లక్షల టన్నులకు పెంపునకు విస్తరణ పనులు చేపట్టడంతో, దాదాపు రూ.24 వేల కోట్ల మొత్తం వివిధ సంస్థల నుంచి విశాఖ ఉక్కు రుణాలుగా తీసుకుంది. వీటికి నెలకు రూ.150 కోట్లు వడ్డీగా చెల్లిస్తోంది. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపితే కొద్దికాలంలోనే అప్పులు తీర్చేసి లాభాలబాట పట్టే అవకాశం ఉంది.

సెయిల్‌కు 200 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము గనులు ఉన్నాయి. అన్ని ప్లాంట్లకు అవసరమైన కోల్‌ను విదేశాల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేయడం వల్ల తక్కువ రేటుకు వస్తోంది. ఇప్పుడు విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేస్తే...ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ముడి ఇనుము సమస్య తీరిపోతుంది. బొగ్గు తక్కువ ధరకు వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకూ తగ్గుతుంది. లాభాలు ఎక్కువ వస్తాయి. దక్షిణ భారతదేశంలో సెయిల్‌కు మార్కెటింగ్‌ వ్యవస్థ అంత బలంగా లేదు. విశాఖలో రెండు పోర్టులు ఉండడం వల్ల ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఉత్పత్తి చేసిన స్టీల్‌ను దేశంలో ఇతర రాష్ట్రాలకు, అవసరమైతే విదేశాలకు కూడా తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతి చేసుకోవచ్చు. ఆర్‌ఐఎన్‌ఎల్‌-సెయిల్‌ విలీనం రెండు సంస్థలకూ లాభదాయకమే! కాగా, ‘విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక సాయమూ అందడం లేదు. దీనిని సెయిల్‌లో విలీనం చేయడమే ఉత్తమ పరిష్కారం. మేం దీనిని స్వాగతిస్తున్నాం. దీనిని ఆమోదిస్తే అందరికీ మేలు జరుగుతుంది’ అని విశాఖ ఉక్కు ఎగ్జిక్యూటివ్స్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ కేవీడీ ప్రసాద్‌ అన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 04:16 AM