ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

7న మెగా పేరెంట్‌-టీచర్స్‌ మీటింగ్‌

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:40 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాల్లో తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ కోరారు.

తల్లిదండ్రులతోపాటు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలి:మంత్రి లోకేశ్‌ లేఖ

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాల్లో తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ కోరారు. పండుగ వాతావరణంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు శుక్రవారం లేఖ రాశారు. పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల వికాసానికి, సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలు దిక్సూచిగా మారుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ఎడ్యుకేట్‌, ఎంగేజ్‌, ఎంపవర్‌ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేరోజున తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహిస్తున్నాం.

వార్డు సభ్యుల నుంచి ఎంపీ వరకు, సర్పంచ్‌ నుంచి సీఎం వరకు ప్రజాప్రతినిధులంతా రాజకీయాలకు అతీతంగా వారి గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు- కళల పట్ల ఆసక్తులను టీచర్ల ముందుంచి మరింత పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, పిల్లలు వారి తల్లిదండ్రులను బడులకు దగ్గర చేయడం మన ప్రభుత్వ లక్ష్యం. పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందినవారైనా వారి పార్టీ జెండాలు, కండువాలు లేకుండా పాల్గొనాలని కోరుతున్నా. పాఠశాలల అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తునా’’ అని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 03:40 AM