ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

minister హాస్టల్‌లో పరిశుభ్రత పాటించండి

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:37 PM

వసతిగృహం లో పరిశుభ్రత పాటించాలని బీసీ సంక్షేమ, చేనేతజౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పుట్టపర్తి ర హదారి పక్కన అద్దెభవనంలో కొనసాగుతున్న బీ సీ బాలికల వసతి గృహా న్ని సోమవారం మంత్రి సవిత తనిఖీ చేశారు.

మంత్రి సవిత

కొత్తచెరువు, సెప్టెంబరు 16: వసతిగృహం లో పరిశుభ్రత పాటించాలని బీసీ సంక్షేమ, చేనేతజౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పుట్టపర్తి ర హదారి పక్కన అద్దెభవనంలో కొనసాగుతున్న బీ సీ బాలికల వసతి గృహా న్ని సోమవారం మంత్రి సవిత తనిఖీ చేశారు. వంటగదికి వెళ్లి భోజనం, కూరలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన భో జనం అందించాలని సిబ్బందికి సూచించారు. వారిని సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. హాస్టల్‌ గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. హాస్టల్‌లో ఎంత మంది విద్యార్థులున్నారు, ఈ గదులు సరిపోతాయా, నూతన భవన నిర్మాణంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాలికల బీసీ వసతి గృహాన్ని ప్రభుత్వాస్పత్రి వెనుక భాగాన కొండకు ఆనుకుని నిర్మించారు. అక్కడ బాలికలకు రక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దానికి మరమ్మతులు చేసి మండల కేంద్రంలోనే ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని అందులోకి మార్చాలని మంత్రిని స్థానికులు కోరారు. ప్రస్తుతం ఉన్న బాలుర వసతిగృహాన్ని బాలికలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Updated Date - Sep 16 , 2024 | 11:37 PM

Advertising
Advertising