ప్రజా ప్రతినిధులపై వైసీపీ అక్రమ కేసులు
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:21 AM
MLA Bolishetti Srinivas demanded that YCP illegal cases against public representatives
చంద్రబాబును జైల్లో పెట్టి.. ఫోన్లలో చూసి ఆనందించారు
దీనిపై విచారణ జరిపించండి: ఎమ్మెల్యే బొలిశెట్టి
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి, జైలులో పెట్టిన వ్యవహారంపై కమిటీ వేసి విచారణ చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చంద్రబాబును జైలులో పెట్టినప్పుడు అప్పటి వైసీపీ కీలక వ్యక్తి జైలులోని సీసీ కెమెరాలను తన ఫోన్‌లో చూసుకునేవిధంగా అధికారులు ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిపై విచారణ చేయాలన్నారు. రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే రూ.15 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ సంస్థ కంపెనీని ప్రారంభించలేదని పరిటాల సునీత చెప్పారు. మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గిరిజనుల కోసం జీవో 3ను పునరుద్ధరించాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కోరారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు వెంటనే జరపాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కోరారు.
Updated Date - Nov 21 , 2024 | 04:21 AM