సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే బుడ్డా
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:42 PM
అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆత్మకూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి అంశాల గురించి సీఎం చంద్రబాబుతో ఆయన చర్చించారు. ప్రత్యేకించి శ్రీశైలం దేవస్థానంలో మాస్టర్ ప్లాన అమలు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, ఆత్మకూరులో నానఅమృత వాటర్ స్కీం, వదరరాజ స్వామి ప్రాజెక్ట్ అభివృద్ధి తదితర ప్రధాన సమస్యలతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని ముఖ్యమైన సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు.
Updated Date - Nov 20 , 2024 | 11:42 PM