ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నువ్వా.. నేనా..!

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:44 AM

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతు న్నాయి. ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతుండ డంతో ఆయా ఉపాఽధ్యాయ సంఘాలు తమకు ఇష్టమైన అభ్యర్థికి మద్దతుగా హైస్కూల్‌స్థాయి లో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.

హోరెత్తుతున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

హ్యాట్రిక్‌కు యూటీఎఫ్‌ ఆరాటం

అధిగమించేందుకు మిగతా అభ్యర్థుల కార్యాచరణ

ఉమ్మడి పశ్చిమ అత్యంత కీలకమే

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతు న్నాయి. ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతుండ డంతో ఆయా ఉపాఽధ్యాయ సంఘాలు తమకు ఇష్టమైన అభ్యర్థికి మద్దతుగా హైస్కూల్‌స్థాయి లో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. టీచర్లను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్‌ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి హ్యాట్రిక్‌ దక్కించుకోవ డానికి అనుకూలురు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఈ నెల 11న ప్రారంభం కాగా యూటీఎఫ్‌ అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తిని ప్రకటించారు. యూటీఎఫ్‌లో కీలకంగా వ్యవహరించి ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఓటర్ల ముందు నిలబడేలా సీపీఎం జాగ్రత్తపడింది. ఆయనకు దీటుగా గంధం నారాయణరావు పోటీలో వున్నారు. వీరితోపాటు నామన వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్‌, అహ్మద్‌షేక్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య గతంలో పోటీ సాధారణంగా ఉండేది. 2009, 2015లో జరిగిన ఎన్నికలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీ స్వరూపాన్నే మార్చేశాయి. 2015లో యూటీఎఫ్‌ అభ్యర్థిగా రాము సూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్‌) పోటీకి దిగగా, ఆయన ప్రత్యర్థులు గెలుపొందాలని కోట్ల రూపాయల విలువైన బహుమతులను ఉపాధ్యాయులకు ఎరగా వేశారు. సాధారణ ఎన్నికలను తలపించేలా రాత్రి పొద్దు పోయే వరకూ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరిగి నానా హంగామా చేశారు. చివరకు సాధారణ కార్యకర్తగా ప్రచారం చేసిన రాము సూర్యారావు భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లోనూ యూటీ ఎఫ్‌ పక్షాన షేక్‌ సాబ్జి పోటీలో నిలబడి అలవోక గా విజయం సాధించారు. కాని, ఆయన గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెంద డంతో ఖాళీ అయిన స్థానంలో తాజాగా పోటీ జరగబోతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం హైస్కూల్‌ ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 16,316 మంది ఓటర్లు ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,947 మంది, ఏలూరు జిల్లా లో 2,605 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణపై రెండు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు డివిజన్‌ లో 33, నూజివీడు డివిజన్‌లో 6, జంగారెడ్డిగూ డెం డివిజన్‌లో 23 పోలింగ్‌ కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఏలూరు జిల్లా మొత్తం ఓటర్లలో ఒక్క ఏలూరు నగరంలో అత్య ధికంగా 900 మంది పైబడి ఉన్నారు. వచ్చే నెల 5న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాబోయే పక్షం రోజులు అత్యంత కీలకంగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రతి హైస్కూల్‌ను సందర్శించి వారి మద్దతు కోరుతున్నారు. అహ్మద్‌ షేక్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సహాయ రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు తెలిపారు. ఎన్నికల బరిలో ఐదుగురు ఉన్నారు. నేటితో ఉపసంహరణల గడువు ముగుస్తుంది.

హోరాహోరీనే ..

గోపిమూర్తి, నారాయణరావు మధ్య పోటీ అనివార్యంగా మారింది. గతంలో పోటీ చేసి ఓటమి పాలైన నారాయణరావు తిరిగి పోటీకి దిగారు. ఆయనకు ఎస్టీయూతోపాటు మరి కొందరు ఉపాధ్యాయులు మద్దతు ఇస్తున్నారు. యూటీఎఫ్‌ దూకుడుకు తానే బ్రేక్‌ వేస్తాననే ధోరణిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు మిగతా అభ్యర్థులు రెండు, మూడు రోజుల్లో ప్రచారాన్ని రసవత్తరంగా మార్చాలనే వ్యూహంలో వున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:44 AM