ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ

ABN, Publish Date - Apr 05 , 2024 | 06:10 PM

అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు.

Mohammad Iqbal

అనంతపురం: అధికార వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం మహమ్మద్ ఇక్బాల్ ఫ్యాక్స్‌తో పాటు ఈ మెయిల్ పంపించారు. 2027 మార్చి వరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని శాసనమండలి చైర్మన్‌ను విజ్జప్తి చేశారు. వారం రోజుల్లో టీడీపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కండువా కప్పుకొనున్నారు.


అయితే గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం (Hindupur MLA Seat) నుంచి వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్ ( Mohammad Iqbal) బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అలాగే హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జీగా నియమించారు. ఆ కొద్దిరోజుల తర్వాత.. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలు ఆయన నుంచి పార్టీ అధినేత వైయస్ జగన్ తప్పించి.. ఆ బాధ్యతలను దీపిక అనే మహిళకు అప్పగించారు. దీంతో ఇక్బాల్‌ను పక్కన పెట్టినట్లు అయింది.

ఆ క్రమంలో ఆయన తీవ్ర ఆవేదనకు గరయ్యారని సమాచారం. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. అదీకాక.. హిందూపురం వైసీపీలో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. దీంతో ఆ గ్రూప్ రాజకీయాలకు సైతం ఇక్బాల్ తీవ్ర కలత చెందారని సమాచారం. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఇక్బాల్.. పదవి విరమణ అనంతరం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Updated Date - Apr 05 , 2024 | 06:33 PM

Advertising
Advertising