ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

90 వేలకు పైగా ముగ్గురికి

ABN, Publish Date - Jun 06 , 2024 | 04:01 AM

ఈసారి ఎన్నికల్లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పదుల సంఖ్యలో అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు.

పల్లా, గంటా, లోకేశ్‌కు భారీ మెజార్టీలు

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఈసారి ఎన్నికల్లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పదుల సంఖ్యలో అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌ 95,235 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌పై గెలుపొందారు. ఇక భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుపై గెలుపొందారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ 91,413 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించారు. పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ 81,870 ఓట్ల మెజార్టీతో అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌పై గెలుపొందారు. నెల్లూరు సిటీలో నారాయణ 72,489 ఓట్ల మెజార్టీతో ఎండీ ఖలీల్‌ అహ్మద్‌పై గెలిచారు. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు 10 వేల లోపు మెజార్టీతో బయటపడ్డారు. మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్‌ రాజు అత్యల్పంగా 351 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి బి.అశోక్‌ రెడ్డి 973 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దర్శిలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి 2,456 ఓట్ల అధిక్యంతో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీపై గెలిచారు. రాయచోటిలో టీడీపీ అభ్యర్థి ఎం.రామ్‌ప్రసాద్‌ రెడ్డి 2,495, అలూరులో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి 2,831, ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ 3,734 మెజార్టీతో బయటపడ్డారు.

Updated Date - Jun 06 , 2024 | 07:42 AM

Advertising
Advertising