ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సంపద సృష్టితో మరింత సంక్షేమం..!

ABN, Publish Date - Apr 30 , 2024 | 05:27 AM

డీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి తమ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది.

లోతైన కసరత్తుతో పథకాల రూపకల్పన

నేడు కూటమి మేనిఫెస్టో విడుదల

చంద్రబాబు, పవన్‌,

  • బీజేపీ నేతల సమక్షంలో ప్రకటన

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి తమ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

బాబుతోపాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. గతంలో 2023లో రాజమ హేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పటికి కూటమి ఏర్పాటు కాలేదు.

తర్వాత ఆ పార్టీతో జనసేన, బీజేపీ కూడా కలిశాయి. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన ఆరు హామీలకు మరి కొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌ తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు.

పేదల పింఛనును రూ.4,000కు పెంచుతామని, బీసీ వర్గాల వారికి వయో పరిమితి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దానిని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇవిగాక రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కానుంది.

మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్ర నేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘నేటి అవసరాలు తీరుస్తాం... రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం’ అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుందని, అప్పులు, పన్నుల బాదుడుతో కాకుండా సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామన్నది కూటమి ఆలోచన అని ఆ వర్గాలు వివరించాయి.

‘రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒకో పథకం, కార్యక్రమం ఉంటాయి. లబ్ధిదారుల, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్‌ జరిగింది’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్రం మీద, ప్రజల మీద మమకారం ఉండాలి. ఇవి చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి సంపదను పెంచి చూపించారు. జగన్‌కు ఇందులో ఒక్కటి కూడా లేవు. అందుకే ఉన్న వృద్ధి కూడా దిగజారింది’ అని విజయకుమార్‌ పేర్కొన్నారు.


సంపద సృష్టికి చంద్రబాబు

బ్రాండ్‌ అంబాసిడర్‌

  • అప్పులకు, పన్నుల బాదుడుకు

  • జగన్‌ ట్రేడ్‌ మార్క్‌: టీడీపీ

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సందర్భంలో రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగిందని ఆ పార్టీ పేర్కొంది.

అప్పులకు, పన్నుల బాదుడుకు జగన్‌ ట్రేడ్‌ మార్కని, అవి లేకుండా సంపద సృష్టించడం ఆయనకు చేతగాదని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘రాష్ట్ర విభజన తర్వాత భారీగా ఆదాయం వచ్చే హైదరాబాద్‌ నగరం తెలంగాణకు పోయింది. ఏపీకి అప్పులు మాత్రం మిగిలాయి. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేశారు.

కొత్తగా పన్నులేవీ వేయకుండా ఆయన దీనిని సాధించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడు ద్వారా ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు. ఇవిగాక అప్పులు విపరీతంగా తెచ్చారు.

తెచ్చిన అప్పుల్లో పెట్టుబడుల కోసం వినియోగించింది కేవలం పావు శాతం మాత్రమే. టీడీపీ ప్రభుత్వం పరిమితంగానే అప్పులు తెచ్చింది. తెచ్చిన వాటిలో 50 శాతం పెట్టుబడులుగా పెట్టింది’ అని ఆయన చెప్పారు. ‘సంపద సృష్టి ఒక కళ. దానికి కష్టపడాలి. స్వార్థం తగ్గించుకోవాలి. దార్శనికతతో పనిచేయాలి.

Updated Date - Apr 30 , 2024 | 06:54 AM

Advertising
Advertising