ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహ్లాదాన్ని పంచే పార్కులో..నర్సరీనా..?

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:25 PM

నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న పార్కును లక్షలాది రూపా యలతో అభివృద్ధి చేశారు. కానీ ఆ పార్కులో నగర ప్రజలు వెళ్లి సేదతీరే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ పార్కులో కొంతభాగాన్ని నర్సరీ మొక్కలు పెంచుకుని అమ్ముకునేందుకు బయట వ్యక్తులకు లీజుకు ఇచ్చారు.

పార్కులో ఏర్పాటు చేసిన నర్సరీ

పార్కులో కొంతభాగాన్ని అద్దెకు ఇచ్చిన నగరపాలక సంస్థ

ఏలూరు టూటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పార్కుల్లో ఆ రెండూ కరువయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులతో అలసిపోయిన చాలామంది కాస్తా ప్రశాంతత కోసం సాయంత్రం పూట పార్కులకు వెళ్లి సేద తీరుతుంటారు. అయితే ఏలూరు నగరపాలక సంస్థ పార్కుల్లో అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. లక్షలాది రూపాయలు పార్కుల్లో సౌకర్యాలు కల్పిం చినట్టు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నా పార్కుల్లో అలాంటి వాతావరణం లేదు. నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న పార్కును లక్షలాది రూపా యలతో అభివృద్ధి చేశారు. కానీ ఆ పార్కులో నగర ప్రజలు వెళ్లి సేదతీరే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ పార్కులో కొంతభాగాన్ని నర్సరీ మొక్కలు పెంచుకుని అమ్ముకునేందుకు బయట వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. అది కూడా నామమాత్రంగా కేవలం నెలకు రూ.15 వేలు అద్దె చెల్లించే విధంగా లీజుకిచ్చారు. నగరంలో కార్పొరేషన్‌ నిర్మించిన ఎన్నో షాపులు అద్దెకివ్వగా చిన్నచిన్న షాపులే రూ.10 వేల నుంచి రూ.15 వేల అద్దె ఉంటుంది. అలాంటిది ఏకంగా పార్కులో కొంతభాగాన్నే రూ.15 వేలు లీజుకు ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు అధికారు లకు ‘ప్రైవేటు’గా వాటాలు వెళ్తున్నా యనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పార్కుల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నర్సరీని పార్కు నుంచి తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:27 PM