ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

14న జాతీయ లోక్‌ అదాలత

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:29 PM

ఈ నెల 14న జాతీయ లోక్‌ అదాలత నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి వెల్లడించారు.

మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

కర్నూలు లీగల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 14న జాతీయ లోక్‌ అదాలత నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి వెల్లడించారు. అందులో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు పోలీసులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక లోక్‌ అదాలత కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీకి అర్హత కలిగి ఉన్న క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, ప్రిలిటిగేషన కేసులను ఈ జాతీయ లోక్‌ అదాలతలో పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. న్యాయాధికారి పి.జ్యోత్స్న దేవి మాట్లాడుతూ పోలీసు అధికారులు కక్షిదారులను సంప్రదించి వారిని రాజీ చేసి వీలైనన్ని ఎక్కువ కేసులు పోలీస్‌ స్టేషన్ల వారీగా పరిష్కారమయ్యేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ర్టేట్‌ ఎం.సరోజనమ్మ, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 11:29 PM