ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: సభ్య సమాజం సిగ్గుపడేలా కావలి ఎమ్మెల్యే అనుచరుల వికృతచేష్టలు.. అర్ధరాత్రి నడిరోడ్డుపై...

ABN, Publish Date - Jan 20 , 2024 | 10:28 AM

Andhrapradesh: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులం అన్న అహకారంతో వారు పెట్రేగిపోతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వికృతచేష్టలకు పాల్పడుతున్నారు.

నెల్లూరు, జనవరి 20: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Kavali MLA Ramreddy Pratap Kumar Reddy) అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులం అన్న అహకారంతో వారు పెట్రేగిపోతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఓ వైసీపీ కార్యకర్త నడిరోడ్డుపై చేసిన హంగామా ఇప్పుడు వైరల్‌గా మారింది. నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగడం చర్చకు దారి తీసింది. వైసీపీ కార్యకర్త ఆగడాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ సంగతి...

ఎమ్మెల్యే అనుచరుడు ఒకడు గతకొద్ది రోజులుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఫుల్‌గా మద్యం సేవించి అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విర్రవీగిపోతున్నాడు. వైసీపీ కార్యకర్త ఆగడాలు శృతిమించడంతో అతడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని మందలించి వదిలేశారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వైసీపీ కార్యకర్త మరింత రెచ్చిపోయాడు. అర్ధరాత్రి వీధుల్లో దుస్తులు విప్పేసి నగ్నంగా తిరుగుతూ వికృతంగా ప్రవర్తించాడు. వైసీపీ కార్యకర్త తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 20 , 2024 | 10:40 AM

Advertising
Advertising