Kotamreddy: నెల్లూరులో మెగా పీటీఎం.. పాల్గొన్న కోటంరెడ్డి
ABN, Publish Date - Dec 07 , 2024 | 03:05 PM
Telangana: పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులని ఒక దగ్గర కలిపిన లోకేష్ నిర్ణయం అద్భుతమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కిందిస్థాయి నేతల నుంచి సీఎం వరకు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు.
నెల్లూరు, డిసెంబర్ 7: నగరంలోని కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి,(MP Vemireddy) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridharreddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులని ఒక దగ్గర కలిపిన లోకేష్ నిర్ణయం అద్భుతమన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కిందిస్థాయి నేతల నుంచి సీఎం వరకు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. ‘‘నేను తొలిసారి ఎమ్మెల్యే అయిన తరువాత ఈ కేఎన్‌ఆర్ స్కూల్‌ను దత్తత్త తీసుకున్నాను. స్కూల్‌కు ఎంపీ రూ.3లక్షలు డొనేట్ చేశారు’’ అని అన్నారు. ఈ ఏడాదిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈగల్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఇది మంచి అవకాశం: ఎంపీ వేమిరెడ్డి
కేఎన్‌ఆర్ స్కూల్ పిల్లలు చదువులో పోటీపడి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ మెగా ఈవెంట్.. మంత్రి లోకేష్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. పిల్లల చదువు వివరాలు తల్లిదండ్రులు, టీచర్స్‌ను అడిగి తెలుసుకునే అవకాశం కల్పించారన్నారు. ‘‘పిల్లలు బాగా చదువుకుంటే మీ కాళ్ల మీద మీరు నిలబడవచ్చు. బాగా చదువుకుంటే ఇతరుల మీద ఆధార పడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్‌లో పక్కన ఎంపీలను చూసినప్పుడు సంతోషం లేదు. పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలని చదువులలో ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలకు నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను’’ అని ఎంపీ వేమిరెడ్డి స్పష్టం చేశారు.
స్పోర్ట్స్‌పై ఆసక్తి పెంచండి: మంత్రి భరత్
కర్నూలు జిల్లాలో ఏ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ చాలా మారిపోయిందన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా పిల్లలు ఎదగాలని.. వారికి తల్లిదండ్రులు సహకరించాలని అన్నారు. ఏఐ ద్వారా చాలా మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు స్పోర్ట్స్‌పై ఆసక్తి పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో చర్చిస్తామన్నారు. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చాగంటి కోటేశ్వరరావుకు ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చారని తెలిపారు. డ్రగ్స్ పై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా చర్యలు చేపట్టారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Flights: గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానాలు..
బోరుగడ్డకి మరో దెబ్బ ఇక జైల్లోనే..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 07 , 2024 | 03:06 PM