TDP: దొంగ ఓట్లపై మాజీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం
ABN, Publish Date - Jan 23 , 2024 | 09:51 AM
నెల్లూరు: ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో భారీ సంఖ్యలో దొంగ ఓట్లపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గంలో 20 వేల నుంచి 25 వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు.
నెల్లూరు: ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో భారీ సంఖ్యలో దొంగ ఓట్లపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గంలో 20 వేల నుంచి 25 వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో నివాసం ఉండటం లేదని, రాత్రి నిద్ర చేస్తేనే ఓటు హక్కు అంటూ రాద్దాంతం చేశారని, సాక్షి పత్రికలో అరపేజీ కథనాలు రాశారని, మరి దొంగ ఓట్లకు ఆ నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.
నెల్లూరు నగరంలో తానే స్వయంగా ప్రతి ఇంటికి తిరిగి దొంగ ఓట్లు గుర్తించానని నారాయణ చెప్పారు. బీఎల్వోలు తొలగిస్తే, అధికారులు మళ్లీ వాటిని చేర్చారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓ కలెక్టర్ ఏకంగా వైసీపీ నేతలకు దొంగ ఓట్లు చేర్చుకోవడానికి లాక్ కోడ్ ఇవ్వడం దారుణమన్నారు. తుది జాబితాల్లో దొంగ ఓట్లు తొలగించకుంటే సహించేది లేదని, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సీఈసీ కూడా పట్టించుకోకపోతే కోర్టులకు వెళుతామని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని నారాయణ వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 23 , 2024 | 09:51 AM