ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1 నుంచి కొత్త మద్యం పాలసీ

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:23 AM

నూతన మద్యం పాలసీని అక్టోబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

  • ఆదాయం కంటే జనం ఆరోగ్యమే ముఖ్యం: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నూతన మద్యం పాలసీని అక్టోబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరు రాష్ర్టాల్లో అధికారులు బృందాలు పర్యటించాయని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు. కొత్త పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మొదటిభేటీ బుధవారం మంగళగిరిలోని సెబ్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల్లో ఉన్న మద్యం పాలసీలను అధికారులు... మంత్రులకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ షాపుల పాలసీ, ప్రైవేటు షాపుల పాలసీకి ఉన్న వ్యత్యాసాలపై చర్చించారు. రిటైల్‌ ట్రేడ్‌, మద్యం ధరలు, పన్నులపైనా ఆరా తీశారు. మరోసారి సమావేశమై లోతుగా అధ్యయనం చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లతో మెరుగైన పాలసీని తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పిచ్చి బ్రాండ్ల వల్ల యువత గంజాయి, డ్రగ్స్‌వైపు వెళ్లారన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలిస్తామన్నారు. పది రోజులుగా ప్రజలు వరదలతో ఇబ్బందిపడుతుంటే పట్టించుకోకుండా నేరస్థుల కోసం జైలుకు వెళ్లడానికి వైసీపీ అధినేత జగన్‌కు సిగ్గుండాలని మంత్రి మండిపడ్డారు. జైలు పక్షికి ప్రజల సమస్యలు కనిపించవని మరోసారి రుజువైందన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 06:41 AM

Advertising
Advertising