ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

ABN, Publish Date - Jul 02 , 2024 | 07:07 PM

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Water Resources Minister Nimmala Rama Naidu

ఏలూరు, జులై 02: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. మంగళవారం ఏలూరులో మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్లతో మాట్లాడారు.

Also Read: Uttar Pradesh: తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి


తాజా వరదల కారణంగా గోదావరి నది నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు వృధా అవుతుందన్నారు. ఇక పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడేకే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే కృష్ణా, రాయలసీమకు ఆధారంగా మారిందని ఆయన గుర్తు చేశారు.

Also Read: AndhraPradesh: 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ


పోలవరం ప్రాజెక్ట్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక శాపమని అభివర్ణించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో 30 నుంచి 35 టీఏంసీల నీరు నిల్వ చేస్తారని.. అయితే ప్రస్తుతం అర టీఎంసీ నీరు మాత్రమే ఆ ప్రాజెక్ట్‌లో నిల్వ ఉందన్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం నాటి సీఎం వైఎస్ జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?

Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 07:08 PM

Advertising
Advertising