ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pension : 3 నెలల్లో ఎప్పుడైనా పింఛన్‌ తీసుకోవచ్చు

ABN, Publish Date - Nov 02 , 2024 | 05:30 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొన్ననే ఆదేశాలు ఇచ్చానని..

64 లక్షల మందికి 2,400 కోట్ల చెల్లింపు: చంద్రబాబు

లబ్ధిదారు ఝాన్సీకి పింఛను అందజేత

రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా..

శ్రీకాకుళం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొన్ననే ఆదేశాలు ఇచ్చానని.. ఎవరైనా ఇవ్వకుంటే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గౌరవంగా పింఛన్‌ అందించాలని.. ఎవరైనా ఇంటి వద్ద కాకుండా ఆఫీసు వద్ద ఇస్తే వారి భరతం పడతానని హెచ్చరించారు. ఈ ఒక్క రోజులోనే 80 శాతం పింఛన్ల పంపిణీ జరిగిందన్నారు. కాగా, ఒంటరి మహిళ బలిజేపల్లి ఝాన్సీ ఇంటికి సీఎం వెళ్లారు. స్వయంగా పింఛన్‌ అందజేశారు. అనంతరం ఆమెతో మాట్లాడారు. ఆరోగ్యం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘ప్రతి నెలా 1న లక్ష్మీదేవి మా ఇంటికి వస్తోంది. ఆ డబ్బు మందుల కోసం ఉపయోగపడుతోంది. నాకు షుగర్‌, థైరాయిడ్‌ ఉన్నాయి. మీ రుణం తీర్చుకోలేం. నేను యోగిని.. పెళ్లి చేసుకోలేదు. నేను చెబుతున్నా.. మీరు కుటుంబంతో సంతోషంగా, చల్లగా ఉండాలి. మీ మనుమడు కూడా సీఎం అవ్వాలి.’ అని ఝాన్సీ అన్నారు. కాగా, ఆమెకు సీఎం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. స్వయంగా పర్యవేక్షణ చేసి ఇంటి నిర్మాణం జరిగేలా చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

విజయనగరం పర్యటన రద్దు

గుంతలు లేని రోడ్లు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు శనివారం విజయనగరం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావాల్సి ఉండగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.

Updated Date - Nov 02 , 2024 | 05:57 AM