Nutrients provided : శారీరక అభివృద్ధికి పోషకాలు అందించాలి
ABN, Publish Date - Sep 05 , 2024 | 10:59 PM
పిల్లల శారీరక అభివృద్ధికి సరైన పోషకాలు అందించినప్పు డు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐసీడీ ఎస్ అర్బన్ ప్రాజెక్టు సూపర్ వైజర్ భాగ్య లక్ష్మీ పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు, సెప్టెంబరు 5: పిల్లల శారీరక అభివృద్ధికి సరైన పోషకాలు అందించినప్పు డు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐసీడీ ఎస్ అర్బన్ ప్రాజెక్టు సూపర్ వైజర్ భాగ్య లక్ష్మీ పేర్కొన్నారు. గురువారం జంగంపేట లోని 1,2,3,4 అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికా హార మాసోత్సవాల్లో పోషక పదార్థాలు ప్రద ర్శించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యక ర్తలు కల్పన, విజలయలక్ష్మీ, శోభ, శ్రీదేవి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
శంకరాపురంలో...
పెద్దశెట్టిపల్లె పంచాయితీ శంకరాపురంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. పిల్లలు కిశోర బాలికలు రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీ డీఎస్ సూపర్ వైజర్ ఈశ్వరి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ వరప్రసాద్, సీహెచ్‌ఓ అంజలి ఏఎన్ ఎం సుజాత అంగన్‌వాడీ వర్కర్లు గీతాలక్ష్మీ రాజ్యలక్ష్మీ మహాలక్ష్మీ పాల్గొన్నారు.
శ్రీరాములపేట అంగన్వాడీలో...
జమ్మలమడుగు, సెప్టెంబరు 5: తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ రాజేశ్వరిదేవి అన్నారు. మోరగుడి గ్రామం శ్రీరాములపేట అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవాలు నిర్వ హించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు గౌషియా, సునీత, అంగన్వాడీ కార్యకర్తలు గౌరీ, తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలు ఎంతో మేలు
పెద్దముడియం, సెప్టెంబరు 5: చిరుధాన్యా లు ఆరోగ్యానికి ఎంతో మేలని ఐసీడీఎస్ సూ పర్‌వైజరు వెంకటలక్ష్మి తెలిపారు. పెద్దపసు పుల-1 కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పోషణ మహా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుఽధాన్యాలైన రాగులు, సజ్జలు, నువ్వులు కొర్రలు తినాలన్నారు. ఆరోగ్య సి బ్బంది ఏఎన్‌ఎం విజయమ్మ, బుజ్జి, ఆశావ ర్కర్లు పుల్లమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు హరి ప్రియ, అపర్ణ, శ్రీదేవి, పార్వతి పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
రాజుపాలెం, సెప్టెంబరు 5: పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరు తుందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు విజయేశ్వ రి, లక్ష్మిదేవి అన్నారు. కొర్రపాడు, రాజుపా ళెం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారో త్సవాలు నిర్వహించారు. సూపర్‌వైజర్లు, కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.
సోమాపురంలో...
చాపాడు, సెప్టెంబరు 5: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను బోధించాలని చాపాడు ప్రాజెక్టు ఐసీడీఎస్ సీడీపీఓ సావిత్రమ్మ అన్నారు. సోమాపురంలో అంగన్వాడీ మాసోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు సుబ్బరత్నమ్మ, ఓబుళమ్మ, కార్యకర్తలు రాధా, అరుణ, అంజనమ్మ, పాల్గొన్నారు.
పలుగురాళ్లపల్లెలో...
బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 5: గర్భిణులు పోషకాహారాలు తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజరు ప్రత్యూష తెలిపారు. పలుగు రాళ్లపల్లె క్లస్టరులో అంగన్వాడీ టీచర్లు, క్లస్టర్ బాలింతలు గర్భిణులు, కిశోర బాలికలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలుగురాళ్లపల్లె క్లస్టర్ అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు, గర్భిణు లు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 10:59 PM