24న కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం కార్తీక వనభోజనం
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:51 PM
కర్నూలు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నంద్యాల రోడ్డులోని ఏఎంఆర్ ఫంక్షన హాలులో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కే.సోమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బజారప్ప తెలిపారు.
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నంద్యాల రోడ్డులోని ఏఎంఆర్ ఫంక్షన హాలులో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కే.సోమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బజారప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో కార్తీక వనభోజనం సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంటు ఎంపీ భైరెడ్డి శభరి, ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, బొగ్గుల దస్తగిరి, నగర మేయర్ బీవై రామయ్య, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, తుగ్గలి నాగేంద్రలు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని కుమ్మరులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు నాగన్న, నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
సర్వజన కార్తీక వనభోజన కార్యక్రమం
కర్నూలు కల్చరల్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఈనెల 24న ఓర్వకల్లు మండలం, బొడ్డువానిపల్లె గ్రామంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సర్వజన కార్తీక నభోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పుసులూరు గ్రామ వాస్తవ్వులు పల్లె ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, ఓర్వకల్లు, కల్లూరు, వెల్దుర్తి మండల భక్తాదులంతా ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ వనభోజన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల చేతప్రత్యేక పూజలు, గోపూజ, నందికోల సేవ, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు ఆటల పోటీలు, సాయంత్రం కార్తీక దీపోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు.
ఫ ఎస్పీకి ఆహ్వానం..
సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో 24న నిర్వహిస్తున్న బ్రాహ్మణ కార్తీక వనభోజన మహోత్సవానికి నగర బ్రాహ్మణ సంఘం నాయకులు ఎస్పీ బిందుమాధవ్‌ను ఆహ్వానించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో బిందుమాధవ్‌ను కలిసిన బ్రాహ్మణులు ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చారు. అనంతరం నగర బ్రాహ్మణ సంఘం నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, ఆఽథ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఎస్పీకి వివ రించారు. అలాగే ఈ నెల 24న సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో నిర్వహించే కార్తీక వనభోజన కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ ప్రముఖులు హాజరవుతారని, కార్యక్రమంలో నగర బ్రాహ్మ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్, ఉపాధ్యక్షుడు టీవీ రవిచంద్ర శర్మ, ఇతర ప్రతినిధులు సీవీ దుర్గాప్రసాద్, సముద్రాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 22 , 2024 | 11:51 PM