Chandrababu: గుర్తుందా? గతేడాది సరిగ్గా ఇదే రోజు..
ABN, Publish Date - Sep 09 , 2024 | 09:07 PM
గుర్తుందా ? గతేడాది సరిగ్గా ఇదే రోజు.. అవును. సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
గుర్తుందా ? గతేడాది సరిగ్గా ఇదే రోజు.. అవును.. సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని బస్సులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 52 రోజుల అనంతరం చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు.
బాబు అరెస్ట్‌తో మారిన రాష్ట్ర రాజకీయం..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో యువగళం పాదయాత్రను నారా లోకేశ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఇల్లు వదిలి ప్రజల మధ్యకు వచ్చారు. నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఇద్దరు చంద్రబాబును జైల్లో కలిసి ఆయన క్షేమ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేవారు.
సరిగ్గా ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే, యవరత్న నందమూరి బాలకృష్ణతోపాటు నారా లోకేశ్‌తో కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిశారు.
పవన్ ప్రకటన..
అనంతరం అదే సెంట్రల్ జైలు వెలుపల పవన్ కల్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తాంటూ ఆయన ప్రకటించారు. అంతే రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వాతావరణం మారినట్లు మారిపోయింది. అదీకాక.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో దేశంలోని వివిధ మహానగరాలు పుణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
హైదరాబాద్‌లో బాబుకు మద్దతుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లంతా..
ఇక హైదరాబాద్ వేదికగా సాప్ట్ వేర్ ఇంజనీర్లంతా కలిసి గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నిర్మాణం కోసం శ్రమించి తీరును ఈ సభలో పాల్గొన్న వక్తలు కళ్లకు కట్టినట్లు వివరించారు.
ప్రజల మధ్యకు భువనమ్మ..
ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఆ యా కుటుంబాలను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించడమే కాదు.. మీకు, మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండ, దండ.. గా ఉంటుందని భరోసా కల్పించారు.
ఎన్నికలు వచ్చేశాయి.. ఓటర్లు క్లారిటీ..
ఇంతలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. అంతే ఆంధ్ర ఓటరు అదును చూసి ఓటుతో కొట్టిన దెబ్బకు ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి. ఈ ఎన్నికల్లో నాటి అధికార పార్టీకి.. నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడం నిజంగా స్వయంకృతాపరాధమే. ఇక ఈ ఎన్నికల్లో కూటమికి రాష్ట్ర ఓటరు బ్రహ్మరథం కట్టారు.
ఏడాది క్రితం ఇదే రోజు.. నంద్యాల్లో..
అంతే చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. బాబూ ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్లారు. అలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల్లో ఆయన సభ నిర్వహించి బస్సుల్లో నిద్రిస్తుండగా.. ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం..
Updated Date - Sep 09 , 2024 | 09:13 PM