ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు కొనసాగుతున్న విరాళాలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:14 PM

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

ఎమ్మెల్యే బుడ్డాకు రూ.లక్ష విరాళం అందజేస్తున్న ఆత్మకూరు బార్‌ అసోసియేషన న్యాయవాదులు

ఆత్మకూరు, సెప్టెంబరు 15: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో బండిఆత్మకూరు మండలంలోని కాకనూరు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డి రూ.5లక్షలు, ఆత్మకూరు బారు అసోసియేషన తరపున ఆ సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, సీనియర్‌ అడ్వకేట్స్‌ కంచర్ల గోవిందరెడ్డి, శాఖమూరి గిరిరాజు, రవికుమార్‌ తదితరులు రూ.లక్ష విరాళం అందజేశారు. అదేవిధంగా టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు రజాక్‌ రూ.లక్ష, జీవనజ్యోతి వికలాంగుల సేవా సంఘం తరపున ఆ సంఘం అధ్యక్షులు రూ.10వేలు, ఆత్మకూరు ఫోటో గ్రాఫర్స్‌ అసోసియేషన తరుపున రూ.20116, ఆత్మకూరు డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన తరుపున రూ.50వేలు, ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1989-90 బ్యాచ పూర్వ విద్యార్థులు యుగంధర్‌, మగ్బుల్‌బాషాలు రూ.50వేలు, ఆత్మకూరు జీపు అసోషియేషన తరుపున ఆ సంఘం నాయకులు పీర్ల వలి రూ.20వేలు విరాళం అందజేశారు. ఇవేకాకుండా ఆయా గ్రామాలు, వార్డుల తరుపున భారీగా విరాళాలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. శ్రీశైలం నియోజకవర్గం తరుపున విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని తాను ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛందంగా స్పందించి విరాళాలు అందజేసి వారందరికి అభినందనలు తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చేరవేయనున్నట్లు ప్రకటించారు.

వరద బాధితులకు జనసేన పార్టీ చేయూత :

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తమ వంతు విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరాములు, నాయకులు శేషకుమార్‌, అమర్‌నాథ్‌, చంద్రశేఖరరెడ్డి, భాస్కర్‌, అరుణ్‌, నారాయణ, షాలుబాషా తదితరులు రూ.41500 విరాళాన్ని అందజేశారు. తమనేత, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ స్పూర్తితో తాము సైతం వరద బాధితులకు అండగా నిలవాలన్న సంకల్పంతోనే విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు.

టీడీపీ నాయకులను అభినందించిన ఎమ్మెల్యే

బండిఆత్మకూరు: విజయవాడ వరద భాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి, సొంతంగా డబ్బు సహాయం చేసిన టీడీపీ నాయకులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అభినందించారు. మండలంలోని పరమటూరుకు చెందిన టీడీపీ నాయకులు సాయిబాబారెడ్డి, పరమేశ్వరరెడ్డి, చంద్ర శేఖర్‌రెడ్డి, రమణారెడ్డి, నాయుడు, నాగేంద్ర, మౌలాలి, గోపాల్‌ రూ.77,000 నగదును ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఏ కోడూరుకు చెందిన టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, మోహనరెడ్డి, మధుసూదనరెడ్డి, శివకుమార్‌, సుధాకర్‌, శంకర్‌రెడ్డి, జగన్మోహనరెడ్డి, శివలింగం, చెంచన్న, సుబ్రహ్మణ్యం, చాంద్‌ బాషా రూ.1,55,000 నగదును ఎమ్మెల్యేకు అందజేశారు. అలాగే వెంగళరెడ్డిపేట నాయకులు రూ,80వేలు, కడమలకాల్వ టీడీపీ నాయకులు రూ.75వేలు విరాళాల నగదును అందజేశారు.

మహానంది: వరద భాధితుల కోసం మండల టీడీపీ కార్యకర్తలు ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహానందిలోని విశ్రాంతి భవనంలో రూ.17.30 లక్షలను విరాళాలు సేకరించారన్నారు. కార్యక్రమంలో నియోజిక వర్గ టీడీపీ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:14 PM

Advertising
Advertising