ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Onion.. buy tears : ఉల్లి.. కొంటే కన్నీళ్లే

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:07 AM

ఉల్లిపాయలు కోస్తేనే కాదు.. వాటిని కొనాలన్నా కన్నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ఽధరలు చూసి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు.

పులివెందుల మార్కెట్లో ఉల్లిపాయలు

పులివెందుల టౌన్‌, అక్టోబరు 8: ఉల్లిపాయలు కోస్తేనే కాదు.. వాటిని కొనాలన్నా కన్నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ఽధరలు చూసి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు ఉల్లిపాయలు రాకపోవడం, మహారాష్ట్ర ఉల్లిపాయలపైనే ఆధారపడాల్సి రావడంతో ధరలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తపంట చాలావరకు దెబ్బతినడంతో అక్కడి నుంచి దిగుమతులు తగ్గాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని ఇక్కడి హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. పులివెందుల రైతు బజారులో ఉల్లిపాయలు కిలో రూ.50కి విక్రయిస్తున్నారంటే ధరల పరిస్థితి ఎలాగుందో అర్థమవుతుంది. ఇక బహిరంగమార్కెట్లో వ్యాపారులు కిలో రూ.70 నుంచి రూ.75 వరకు అమ్ముతున్నారు. ఇళ్లవద్దకు వచ్చి ఆటోల్లో విక్రయించేవారు రెండు కిలోలు ఉల్లిపాయలు రూ.130కి అమ్ముతు న్నా రు. మొన్నటి వరకు వీరు 100 రూపాయలకు 4 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు కిలోలు కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం పులివెందుల హోల్‌సేల్‌ మార్కెట్లో ఉల్లి కిలో రూ.65 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది.


దిగుబడి ఆలస్యం కావడంతో..

ఉల్లిపాయ లేకుండా ఏ కూరా రుచికరంగా ఉండదు. మూడునెలల క్రితం కిలో రూ.20 పలికిన ధర నేడుమూడింతలు దాటింది. వరుసగా పండుగలు, శుభాకార్యాలు ఉండడంతో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల సాగు తగ్గి దిగుబడి పడిపోయింది. వ్యాపారు లు నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. కర్నూలులో సాగయ్యే ఉల్లిపంట దిగుబడి ఈ ఏడాది ఆలస్యమైంది. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు ఉల్లిపాయలకు ఇది అన్‌సీజన్‌ కావడంతో వాటి దిగుమతి తగ్గింది. ఇక మహారాష్ట్ర ఉల్లి తక్కువగా వస్తోంది. దీంతో ఉల్లి ధర మరింత పెరిగి కంటతడి పెట్టిస్తోంది.

వెల్లుల్లిదీ అదే దారి

ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. దాదాపు ఆరు నెలలుగా వీటి ధరలు పైపైకే పోతున్నాయి. ఏడాది క్రితం కిలో రూ.100 ఉన్న వెల్లుల్లి ధర ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో రూ.450కి చేరింది. మసాల వంటకాల్లో ప్రధానంగా వాడే వెల్లుల్లి ధరలు ఇలా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా వెల్లుల్లిధరలు అదుపులోకి రాకపోవడంతో పేదల ఇంట్లోని వంటల్లో రుచి తగ్గిందని చెప్పాలి. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి.

మరో రెండు మూడు వారాలు భారమే

ఉల్లి ధరాఘాతం మరో రెండుమూడు వారాలు ఉండవచ్చని హోల్‌సేల్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అయినా కర్నూలు నుంచి అయినా కొత్తపంట వస్తే కానీ ధరలు దిగిరావని చెబుతున్నారు. అప్పటి వరకు మహారాష్ట్ర పాత ఉల్లిపాయలే మార్కెట్‌ను శాసిస్తాయి. దీంతో ధరల్లో పెరుగుదల తప్పదు. ఈ నేపధ్యంలో ఉల్లిధరల నియంత్రణకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 12:07 AM