ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆప్షన్‌-3 ఇళ్ల బిల్లులు నిలిపివేత

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:48 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోందని,

అక్టోబరు నాటికి 50 వేల ఇళ్ల పూర్తికి చర్యలు

10 వేల ఇళ్ల శ్లాబులకు 100 రోజుల ప్రణాళిక

గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోందని, ఈ విచారణలో గుర్తించిన లోపాలను సరిదిద్దేవరకు బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి తెలిపారు. ఆప్షన్‌-3 ఇళ్ల కాంట్రాక్టర్లు, హౌసింగ్‌ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన విజయవాడలోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల హౌసింగ్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకుని రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 50 వేల ఆప్షన్‌-3 ఇళ్లను అక్టోబరు నెలాఖరులోపు పూర్తి చేయించే బాధ్యతను హౌసింగ్‌ అధికారులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జియో ట్యాగింగ్‌, ఇతర పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని, జిల్లాల అధికారులు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. హౌసింగ్‌ అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. 100 రోజులు లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఇళ్ల శ్లాబులను ఈ వారంలోనే పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

Updated Date - Sep 14 , 2024 | 07:22 AM

Advertising
Advertising