AP: ఆలయాల్లో ప్రొటోకాల్‌పై కీలక మార్పులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ABN, Publish Date - Sep 27 , 2024 | 09:36 PM
తిరుమల ఘటన తరువాత ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఆలయాల్లో ప్రొటోకాల్‌పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: తిరుమల ఘటన తరువాత ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఆలయాల్లో ప్రొటోకాల్‌పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టువస్త్రాల సమర్పణలో నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొంది. వస్త్రాలను దేవదాయశాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి మాత్రమే సమర్పించాలి.
పట్టువస్త్రాల సమర్పణ, దేవాలయాల్లో రాష్ట్ర పండుగల నిర్వహణకు అయ్యే ఖర్చును సీజీఎఫ్ నుంచి వాడుకోవాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులకు సంబంధించి యూసీలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సుప్రీంలో త్వరలో విచారణ..
లడ్డూ కల్తీపై అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందేనంటూ అమిత్ షా, సుప్రీంకోర్టు సీజేకు పలువురు లేఖలు రాశారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెప్టెంబర్ 30న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుబ్రమణ్య స్వామి , వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది. తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోరారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకీ సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్
YS Sharmila: డిక్లరేషన్‌పై మీడియా ప్రశ్న.. షర్మిల సమాధానం ఇదే..
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 27 , 2024 | 09:40 PM