ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాట నిలబెట్టుకున్న పవన్‌

ABN, Publish Date - Oct 10 , 2024 | 03:37 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

సొంత డబ్బుతో మైసూరివారిపల్లె పాఠశాలకు ఆటస్థలం

ఎకరం కొనుగోలు చేసి అందజేసిన డిప్యూటీ సీఎం

రాయచోటి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆగస్టు 23న మైసూరివారిపల్లెలో జరిగిన గ్రామసభలో ఆయన పాఠశాలకు క్రీడామైదానం కోసం స్థలం కొనిస్తానని మాట ఇచ్చారు. రూ.60 లక్షల సొంత డబ్బుతో ఎకరం స్థలం కొనుగోలు చేసి మైసూరివారిపల్లె పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ డాక్యుమెంట్లను బుధవారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, రాజంపేట సబ్‌కలెక్టర్‌ నిధియాదేవి సమక్షంలో మైసూరివారిపల్లె సర్పంచ్‌ సంయుక్తకు అందజేశారు.

పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత: పవన్‌

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శా ఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ కోరారు. విజయవాడలోని ఓ హోటల్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వర్క్‌షా్‌పను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు.. భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించడం కూడా తమ బాధ్యతగా గుర్తించాలి. జల, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 03:37 AM