AP HighCourt: కోడికత్తి శ్రీను బెయిల్‌పై అత్యవసరంగా విచారించండి.. హైకోర్టులో పిటిషన్
ABN, Publish Date - Jan 22 , 2024 | 12:23 PM
Andhrapradesh: కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, జనవరి 22: కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఐదురోజుల నుంచి జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా జైలులో శ్రీను మగ్గుతున్నారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలను కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చారు. న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. రేపు (మంగళవారం) జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 22 , 2024 | 12:23 PM