ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

ABN, Publish Date - May 17 , 2024 | 04:23 AM

పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి

పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పట్టణాల్లో దుకాణాలు మూయించిన పోలీసులు

గృహ నిర్బంధంలోనే కాసు, పిన్నెల్లి, గోపిరెడ్డి

నరసరావుపేట, మే 16 : పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి బయటపడ్డాయి. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి, సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామాల్లో నిర్వహించిన సోదాల్లో బాంబుల డంప్‌లు బయటపడ్డాయి. పిన్నెల్లిలో చింతపల్లి సైదా, నన్ని, అల్లాభక్షుల గృహాల్లో 51 పెట్రోలు బాంబులు, మరణాయుధాలను స్వాధీన పరుచుకున్నారు. మాదలలో నిర్వహించిన తనిఖీల్లో వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రో బాంబులు బయటపడ్డాయి. వీరందరినీ అదుపులోకి తీసుకుని రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, కారంపూడి, మాచర్ల పట్టణాల్లో దుకాణాలను పోలీసులు మూయించారు. వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధిక సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల గృహ నిర్బంధం గురువారం కూడా కొనసాగింది. ముందస్తు చర్యలో భాగంగా పోలీస్‌ పికెట్లు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీంగ్‌ సంఘటనలపై దాదాపు 40 కేసులు నమోదు చేశారు. పట్నాడు అంతటా 144 సెక్షన్‌ మూడో రోజూ కొనసాగింది.

Updated Date - May 17 , 2024 | 04:23 AM

Advertising
Advertising