ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీబీఐ, ఈడీకి ఇవ్వాలంటూ పిల్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:17 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మరికొందరిపై దాఖలైన కేసుల విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణను హైకోర్టు రెండు నెలలకు వాయిదా వేసింది.

హైకోర్టు విచారణ 2 నెలలకు వాయిదా

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మరికొందరిపై దాఖలైన కేసుల విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణను హైకోర్టు రెండు నెలలకు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలన్న అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, అసైన్డ్‌ భూముల కొనుగోలు, లిక్కర్‌ పాలసీ, ఉచిత ఇసుక విధానం, ఫైబర్‌గ్రిడ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబు, మరికొందరిపై సీఐడీ నమోదు చేసిన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించాలంటూ విజయవాడకు చెందిన స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్‌ కె.బాలగంగాధర్‌ తిలక్‌ ఈ పిల్‌ వేశారు.

Updated Date - Sep 12 , 2024 | 06:50 AM

Advertising
Advertising