జైన సన్యాసుల పాదయాత్ర
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:45 PM
ప్రజలు అహింసా మార్గంలో నడవాలన్న సందేశంతో దిగంబర జైన సన్యాసులు చేపట్టిన పాదయాత్ర శనివారం డోన్ మీదుగా వెల్దుర్తికి చేరుకుంది.

వెల్దుర్తి, జూన్, 8 : ప్రజలు అహింసా మార్గంలో నడవాలన్న సందేశంతో దిగంబర జైన సన్యాసులు చేపట్టిన పాదయాత్ర శనివారం డోన్ మీదుగా వెల్దుర్తికి చేరుకుంది. బెంగుళూరు నుంచి అంతర్మాన గురుదేవ్ ఆచార్య శ్రీ 108 ప్రసన్న సాగర్జీ మహరాజ్ జీ సంసంద్ తరపున 15 మంది సాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. వీరు హైదరాబాదు మీదుగా గోమఠేశ్వరం అక్కడ నుంచి కుల్చారం చేరుకోనున్నట్లు పాదయాత్ర భక్తులు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న జైన సన్యాసులను పలువురు దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు.