Pinnelli : ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్టు
ABN, Publish Date - Jun 27 , 2024 | 02:30 AM
మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరా్‌ఫగా మారిన వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆట ఎట్టకేలకు కట్టింది.
ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో అదుపులోకి
ఎస్పీ కార్యాలయానికి తరలింపు.. ‘బెయిల్’ పిటిషన్‌ను కోర్టు
కొట్టేసిన వెంటనే రంగంలోకి పోలీసులు.. మొత్తం 14 కేసులు
నేరారోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇస్తే ప్రజలకు
తప్పుడు సంకేతాలు.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత
పోలింగ్‌రోజు ఈవీఎంల ధ్వంసం, సీఐపై దాడి,
హత్యాయత్నం కేసుల్లో ‘బెయిల్’ కోరిన పిన్నెల్లి
అయితే, దానివల్ల దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం
బెయిల్‌కు సహేతుక కారణాలు లేవన్న బెంచ్
నరసరావుపేట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరా్‌ఫగా మారిన వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆట ఎట్టకేలకు కట్టింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్లపై దౌష్ట్యానికి పాల్పడిన కేసుల్లో నరసరావుపేటలో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్లు బుధవారం తిరస్కరణకు గురయ్యాయి. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 3.47 గంటల సమయంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అరెస్టు వార్తను ఎస్పీ మల్లికాగార్గ్ రాత్రి 7 గంటల సమయంలో ధ్రువీకరించారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్పీ కార్యాలయం నుంచి నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి 8 గంటల సమయంలో తరలించారు. అనంతరం 9.13 గంటలకు ఆస్పత్రి నుంచి ఎస్పీ కార్యాలయానికి తిరిగి తీసుకొచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో కేసులు నమోదు కావడంతో ఆయనను మాచర్ల కోర్టులో హాజరు పరచాలని పోలీసులు నిర్ణయించారు. రాత్రి 10 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
సీసీటీవీ ఫుటేజీ బయటకు రాకపోతే..!
పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి పిన్నెల్లిపై పోలీసులు అరెస్టు చేయగలిగారు. అదే గనుక ఈ దృశ్యాలు బయటకు రాకుంటే పిన్నెల్లి చేసిన సవాలక్ష పాపాల్లాగే ఈ నిజం కూడా సమాధి అయిపోయేదే. ఎన్నికలు జరిగిన మే 13వ తేదీన కేపీ గూడెం, రాయవరం పోలింగ్ బూత్‌లపై దాడులు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం చేశారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేఖ్యానాయక్‌పై పిన్నెల్లి అనుచరులు హత్యాయత్నం చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి తరిమికొట్టారు. పిన్నెల్లి నేతృత్వంలో వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాన్ని ముట్టడించారు. దీనిపై టీడీపీ నేతలు... అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. తమపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ వైసీపీ గూండాలు మరింతగా రెచ్చిపోయారు. బరిసెలతో మూకుమ్మడి దాడులు చేశారు. ఈ వీడియోలను టీడీపీ నేతలు బయటపెట్టడంతో రాష్ట్రమంతా విస్తుపోయింది. ఈసీ రంగంలోకి దిగి పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది.
ఎన్నికలకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు!
నిందితుని అరెస్టుతో ఈ అంశానికి తార్కిక ముగింపు
వ్యవస్థలను బెదిరించేవారిని ఉపేక్షించబోం: ఈసీ
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించే ఎవరికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈవీఎంల ధ్వంసం, ఇతర నేరాలపై నమోదైన కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారావు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడం, ఆ వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా దుస్సాహసాలకు ఇకముందు ఎవరూ పాల్పడబోరని ఆశిస్తున్నాం. ఈవీఎం డ్యామేజ్‌కు కారణమైన నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ అంశానికి తార్కిక ముగింపు లభించినట్టే. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే సూత్రాన్ని ఇది బలపరిచింది. ఎన్నికల ప్రక్రియను పరిరక్షించడానికి ఈసీ కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థను బెదిరించే వారిని ఉపేక్షించబోం’’ అని ఆ ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, మే 13వ తేదీన పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని
Updated Date - Jun 27 , 2024 | 02:34 AM