నెల్లూరు జైలులో రేపు పిన్నెల్లికి జగన్‌ ఓదార్పు

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:12 AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారంనాడు నెల్లూరు కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు.

నెల్లూరు జైలులో రేపు పిన్నెల్లికి జగన్‌ ఓదార్పు

బెంగళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం దంపతులు

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారంనాడు నెల్లూరు కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్టవడం, మాచర్ల కోర్టు 14 రోజులు విధించి నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కాగా.. జగన్‌ సతీసమేతంగా మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో వారికి మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా సీఎం అంటూ నినాదాలు చేశారు. జగన్‌ బుధవారం పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఇంకోవైపు ఆయన బెంగళూరు నుంచి వచ్చినా ఆయన తాడేపల్లి నివాసం వద్దా ఎలాంటి కోలాహలమూ లేదు. స్వాగత సన్నాహాలూ, హంగూ ఆర్భాటాలూ కనిపించలేదు.

Updated Date - Jul 03 , 2024 | 05:30 AM

Advertising
Advertising