ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పదికి ప్రణాళిక

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:08 AM

పదోతరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ. టెన్తలో సాఽధించే మార్కులు, సబ్జెక్టు నైపుణ్యాలు భవితకు పునాదులుగా నిలుస్తాయి.

: ఆదోని నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం ప్రత్యేక తరగతులు

పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నధ్ధత

ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

డిసెంబర్‌ ఆఖరి నాటికి సిలబస్‌ పూర్తి

మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యాశాఖ యాక్షన ప్లాన

కూటమి ప్రభుత్వం తెలుగు మాధ్యమాల్లో రాసేందుకు అవకాశం

ఆదోని అగ్రికల్చర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ. టెన్తలో సాఽధించే మార్కులు, సబ్జెక్టు నైపుణ్యాలు భవితకు పునాదులుగా నిలుస్తాయి. అందుకే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి అత్యధిక మంది విద్యార్థులు మెరుగైన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి కసరత్తు చేపడుతోంది. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కార్యరూపం చేయాలని జిల్లా విద్యాశాఖ స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మెరుగైన విద్యాభ్యాసానికిముందుకు వెళ్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు ఇప్పటి నుంచే విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. నవంబరు ఒకటో తేదీ నుంచే బడి సమయానికి గంట ముందు ఉదయం 8 గంటలకు బడి ముగిశాక సాయంత్రం నాలుగు గంటలకు స్టడీ అవర్స్‌ నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్టడీ అవర్‌ నిర్వహించి వారికి పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తారు. వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఫ వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

కర్నూలు జిల్లాలో 521 ప్రభుత్వ, జిల్లా పరిషత, పురపాలక, గురుకుల, కేజీబీవీ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు 32 వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. వీరంతా వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. అందుకోసం 100 రోజుల ప్రణాళికను రూపొందించారు. గత ఏడాది 2023-24 లో కర్నూలు జిల్లాలో 30,802 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 19,242 ఉత్తీర్ణత సాధించి 62.47శాతం ఉత్తీర్ణత శాతంగా నిలిచింది. గత ఏడాది లోటుపాట్లను సవరించుకుని ముందుగానే మెరుగైన ఫలితాలు సాధనకు ప్రయత్నిస్తున్నారు.

ఫ డిసెంబరు ఆఖరి నాటికి సిలబస్‌ పూర్తి

పాఠశాలల్లో ఇప్పటికే ఉపాధ్యాయులు 85శాతం సిలబస్‌ పూర్తి చేశారు. మిగిలిన సిలబస్‌ డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి అయ్యేలా జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్‌ పాల్‌ ఆదేశాలు జారీ చేశారు. 100రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులను కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా వారికి ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిరోజు పాఠ్యాంశాల వారీగా టెస్టులు నిర్వహించి మెరుగైన స్థాయికి చేరేలా కృషి చేయాలని సూచించారు. జనవరి నుంచి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేలా చూస్తున్నారు. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ తరహా పరీక్షలను ఆంగ్లంలో రాసే విధంగా చేపట్టడంతో గ్రామీణ పేద ప్రభుత్వ పాఠశాలలో చదివే విధ్యార్థులు అవస్థలు పడ్డారు. కనీస మార్కులు కూడా రాక చతికిల పడ్డారు. ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఇలాంటి పొరపాట్లను సరిదిద్ది ఈ ఏడాది నుంచి తెలుగు మాధ్యమంలోనూ పదో తరగతి వార్షిక పరీక్షలను రాసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. దీంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.

ఫసందేహాలను నివృత్తి చేస్తున్నారు

- సాయి చరణ్‌, నెహ్రూ మెమోరియల్‌ పాఠశాల, ఆదోని

ఉదయాన్నే బడికి రావడంతో ఉపాధ్యాయుల చెప్పిన పాఠాలు చక్కగా గుర్తుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో తమను ఉపాధ్యాయులు చదివిస్తున్నారు. రోజూవారీగా ఉదయం, సాయంత్రం వేళల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు చదివిస్తున్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల్లో ఉన్న సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు.

ఫ పరీక్షలపై భయం తొలిగిపోయేలా..

- రీతిక, విద్యార్థిని, ఆదోని

సిలబస్‌ దాదాపుగా పూర్తయింది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సిలబస్‌ పూర్తిచేసి వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపుతున్నారు. ఎప్పటికప్పుడు స్లిప్‌ టెస్‌లు నిర్వహించి పరీక్షలు అంటే భయం పోగొట్టే విధంగా ఉపాధ్యాయులు మాకు శిక్షణ ఇస్తున్నారు.

ఫ ప్రతి ఒక్కరూ పాస్‌ కావాలన్నదే లక్ష్యం

- శ్యామ్యూల్‌ పాల్‌, డీఈఓ, కర్నూలు

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను సన్నద్ధం చేశాం. అందుకు తగ్గ యాక్షన ప్లాన రూపొందించాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను ఇప్పటినుంచే వారిని పరీక్షలకు సిద్ధం చేసి మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించాము, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని దత్తత తీసుకుని ప్రతిరోజు సందేహాలు నివృత్తి చేసి, పాఠ్యాంశాల వారీగా స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహించి మంచి మార్కులతో ప్రతి విద్యార్థి పాస్‌ అయ్యేలా చూస్తున్నాం. గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే మా లక్ష్యం. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - Nov 29 , 2024 | 12:08 AM