ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరింత సాయం చేయండి

ABN, Publish Date - Oct 21 , 2024 | 04:34 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం లోకేశ్‌ ఢిల్లీలో ఉన్నారు.

ఢిల్లీలో అమిత్‌షాతో లోకేశ్‌ భేటీ

రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం లోకేశ్‌ ఢిల్లీలో ఉన్నారు. అడిగిందే తడవుగా హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకడంతో.. లోకేశ్‌ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మరింత కేంద్రం సాయం అందించాలని కోరారు. లోకేశ్‌ ప్రతిపాదనకు అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిమధ్య భేటీ సాగింది. ‘ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా కీలకస్థానంలో నిలబెట్టేందుకు అమిత్‌షా అందిస్తు న్న సహకారం, రాష్ట్రం పట్ల ఆయన శ్రద్ధ గొప్పవి’ అని లోకేశ్‌ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 04:34 AM