ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

ABN, Publish Date - Oct 06 , 2024 | 03:15 AM

దేశవ్యాప్తంగా 9.4కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

  • మహారాష్ట్రలో విడుదల చేసిన ప్రధాని మోదీ

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 9.4కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. శనివారం మహారాష్ట్రలోని వాషిమ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి, పీఎం కిసాన్‌ సొమ్మును నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఏపీలో పీఎం కిసాన్‌కు 41,84,448మంది రైతుల్ని అర్హులుగా గుర్తించారు. ఒక్కో రైతుకు రూ.2వేల చొప్పున రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులకు రూ.836.89కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈకేవైసీ చేయించుకుని, ఆధార్‌ అనుసంధానమైన రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమవుతాయని ఆయన తెలిపారు. కాగా, 2019లో ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Updated Date - Oct 06 , 2024 | 03:15 AM