ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య కళాశాలలపై విషం!

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:48 AM

వైద్య కళాశాలలపై మాజీ సీఎం జగన్‌ విషం చిమ్ముతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం అబద్ధాలతో నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు విపక్షంలోనూ అదే ఎత్తుగడను నమ్ముకుంటున్నారు.

నిర్మాణానికి ఒక్క పైసా కేటాయించని జగన్‌ ప్రభుత్వం

నాలుగేళ్లలో నాలుగో వంతు పనులూ పూర్తి చేయలేదు

వైద్య కళాశాలలపై మాజీ సీఎం జగన్‌ విషం చిమ్ముతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం అబద్ధాలతో నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు విపక్షంలోనూ అదే ఎత్తుగడను నమ్ముకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణంలో తానేదో ఘనంగా చేసినట్లు చెప్పుకొంటూ... కూటమి ప్రభుత్వం వాటిని గాలికొదిలేసిందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

ఇప్పుడు మెడికల్‌ కాలేజీలు, సీట్లపై తప్పుడు ప్రచారం

విపక్షంలోనూ అబద్ధాలనే నమ్ముకున్న మాజీ సీఎం

విద్యార్థులకు అన్యాయమంటూ మొసలి కన్నీరు

గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను

కూటమి ప్రభుత్వంపైకి నెట్టేందుకు యత్నాలు

పీజీ సీట్ల నిధులు కాలేజీ నిర్మాణాలకు మళ్లింపు

జగన్‌ నిర్వాకంతో ఆ సీట్లు నిలిచిపోయే ప్రమాదం

25ు పనులకు.. 16 శాతమే బిల్లులు చెల్లింపు

అవీ నాబార్డు, కేంద్ర నిధులతో చెల్లించి డబ్బాలు

కాంట్రాక్ట్‌ సంస్థలకు రూ.674 కోట్ల బకాయిలు

పనులు నిలిపేసిన సంస్థలు..

అడ్మిషన్లు నిలిచిపోవడానికి ఇదే కారణం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తామని గత జగన్‌ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. వీటి నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా అందులో నాలుగో వంతు ఖర్చు కూడా చేయలేదు. పైగా ఈ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు కాలేజీలను గాలికి వదిలేసిన జగన్‌.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అభాండాలు మోపుతున్నారు. మంగళగిరిలో రూ.1,100 కోట్లతో ఎయిమ్స్‌ను కేంద్రం కేవలం 17 నెలల్లో నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం నాలుగేళ్లలో ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయింది. పైగా రూ.8,480 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించిన కాలేజీల్లో చాలావరకు ఇప్పటికీ పునాదుల దశలోనే ఉన్నాయి. మరోవైపు ఈ మొత్తంలో దాదాపు రూ.5వేల కోట్ల వరకూ రుణాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించినవే తప్ప రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కేటాయించలేదు.

ఇదేనా చిత్తశుద్ధి?

వైద్య కాలేజీల్లో రూ.2,125 కోట్ల విలువైన పనులనే వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది. అందులోనూ కాంట్రాక్ట్‌ సంస్థలకు రూ.1,451 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.674 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై అంతలా బాధపడుతున్న జగన్‌ ఎందుకు బిల్లులు బకాయి పెట్టారో చెప్పాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఇటీవల ప్రశ్నించారు. నాలుగేళ్లలో 25శాతం పనులు కూడా చేయకపోగా, 16శాతం బిల్లులు మాత్రమే చెల్లించిన జగన్‌కు మెడికల్‌ కాలేజీల నిర్మాణంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టకపోవడానికి కేవలం జగనే బాధ్యుడని మంత్రి స్పష్టం చేశారు.


అందుకే అనుమతులు రాలేదు

మరోవైపు పార్వతీపురం మెడికల్‌ కాలేజీకి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్‌ సంస్థలు పనులు నిలిపేశాయి. కొన్ని సంస్థలు అయితే నెలల తరబడి పనులు నిలిపేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు కాలేజీల నిర్మాణాలు గత ప్రభుత్వంలోనే నిలిచిపోయాయి. అందుకే ఫేజ్‌-2 మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతులు లభించలేదు. ఐదు కాలేజీల్లో నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండటంతో పాటు ఫ్యాకల్టీ నియామకాలు కూడా పూర్తి చేయలేదు. దీంతో ఆడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు జగన్‌ అండ్‌ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అప్పులతో నిర్మాణాలు

మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటివరకూ చేపట్టిన నిర్మాణాలు మొత్తం అప్పుల తెచ్చిన నిధులతో చేపట్టినవే. రూ.8,480కోట్లలో నాబార్డు నుంచి రూ.3,672కోట్లు రుణాలు తీసుకున్నారు. కేంద్రం రూ.975 కోట్ల వరకూ ఇచ్చింది. ఇవికాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం కింద మరో రూ.301 కోట్లు తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం అందించాల్సిన నిధులను కూడా మెడికల్‌ కాలేజీలకు మళ్లించారు. నాలుగేళ్లలో నాబార్డు, కేంద్రం, ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా సేకరించిన నిధుల నుంచే కాంట్రాక్ట్‌ సంస్థలకు బిల్లులు చెల్లించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నాబార్డు అయినా, కేంద్రం అయినా అవి నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కొంత మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది.


నాబార్డు ఇస్తున్న రుణాలు, కేంద్రం ఇస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ లేకపోవడంతో రెండో విడత నిధులు విడుదల ఆగిపోయింది. దీంతో గత ప్రభుత్వం పీజీ సీట్ల నిధులను కూడా కాలేజీలకు మళ్లించింది. పాత మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు పెంపు కోసం కేంద్రం రాష్ట్రానికి దాదాపు రూ.700కోట్ల వరకూ ఇచ్చింది. ఈ మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయింది. ఈ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల కోసం మళ్లించింది. దీనికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సహకరించారు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసిన జగన్‌... ఇప్పుడేదో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అన్యాయం జరిగిపోతుందని ఆరోపణలు చేస్తున్నారు. పీజీ సీట్ల కోసం కేటాయించిన నిధులు వాటికే ఉపయోగించకపోతే ఆ సీట్లు పోతాయన్న విషయం తెలిసి కూడా జగన్‌ ప్రభుత్వం వాటిని నిర్మాణాలకు మళ్లించింది. పీజీ సీట్లు పోయినా విద్యార్థులకు నష్టం రాదని, ఎంబీబీఎస్‌ సీట్లు రాకపోతే మాత్రం నష్టపోతారని చెప్పడంపై జగన్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Sep 16 , 2024 | 03:50 AM

Advertising
Advertising